ఆగస్టు 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు

-

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి  ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు(సీబీఆర్‌టీ) జరగనున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు పొందుపరిచామని, అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గురుకుల నియామక బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్యబట్టు సూచించారు. ఈ పోస్టులకు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్‌, ఫొటో తీసుకుంటారని, అభ్యర్థులందరూ సూచించిన సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు.

19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయని మల్లయ్యబట్టు తెలిపారు. ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు అని.. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు.  ప్రతి షిఫ్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news