పీఎం కిసాన్ లబ్ది దారులకు బిగ్‌ అల్టర్‌..ఇలా చేయకపోతే ఇక అంతే !

-

పీఎం కిసాన్ లబ్ది దారులకు బిగ్‌ అల్టర్‌. ఈ ఏడాది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 25 వ తేదీలోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ-కేవైసీ, కేవైసీ రెండు విధానాలు వేర్వేరు.

ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ-కేవైసీ అంటారు. ఆధార్‌ రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ-కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్‌ లబ్ధిదారులు మళ్లీ ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్, ఫేక్‌ అకౌంట్లను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే మీరు చేసుకొవచ్చు..ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే ఈ-కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version