మీషో ఉద్యోగులకు 11 రోజుల పాటు రీఛార్జ్ హాలిడేస్

-

కొన్ని కంపెనీలు కేవలం లాభాలు మాత్రమే చూసుకోవు. వారి ఉద్యోగులపైనా శ్రద్ధ తీసుకుంటాయి. అలాంటి వాటిల్లో ముందుంటుంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో. ఉద్యోగుల భద్రత, సంక్షేమం, వారి ఆరోగ్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తమ ఉద్యోగులందరికీ 11 రోజుల పాటు వరుస సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

‘రీసెట్ అండ్ రీఛార్జ్‌’ పేరుతో అక్టోబరు 22 నుంచి నవంబరు 1 వరకు ఈ బ్రేక్‌ ఇవ్వనుంది. పండగ సమయంలో బిజీ విక్రయాల తర్వాత ఉద్యోగులు విధుల నుంచి పూర్తిగా విరామం తీసుకుని వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీషో వెల్లడించింది.

‘‘వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌, విశ్రాంతి, పునరుత్తేజం.. ఓ ఉద్యోగి తమ విధుల పట్ల సంతృప్తిగా ఉండటానికి, క్షేమంగా ఉండటానికి ఇవి చాలా ప్రధానం. వాటిని గుర్తించినప్పుడే కంపెనీ పని సంస్కృతి మెరుగుపడుతుంది. మా రీసెట్‌ అండ్‌ రీఛార్జ్‌ ప్రోగ్రామ్‌తో సంప్రదాయ కార్యాలయ నిబంధనలకు కొత్త అర్థం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ బ్రేక్‌లో ఉద్యోగులు తమకు నచ్చినట్లుగా సమయాన్ని గడపొచ్చు. విహారయాత్రలకు వెళ్లొచ్చు. కొత్త అభిరుచిని నేర్చుకోవచ్చు’’అని మీషో ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version