పొంగులేటికి భారీ షాక్..ఇవాళ బీఆర్‌ఎస్‌లోకి తెల్లం వెంకట్రావు

-

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలందరూ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. తాజగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు తెల్ల వెంకట్రావు, పినపాక, అశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు విప్, కొత్తగూడెం బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్‌. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సమక్షంలో ఇవాళ ఉదయం 10.30గంటలకు తెలంగాణ భవన్ లో చేరికలు ఉంటాయి. కాగా, తెల్లం వెంకటరావు…భద్రాచలం టికెట్టు ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఆ డిమాండ్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో… బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు తెల్లం వెంకటరావు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version