ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో బిగ్ ట్విస్ట్ !

-

ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

SI Harish incident

ఆమె గురించి ఆరా తీసిన హరీష్‌కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని విషయం తెలిసింది. దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు.

అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సెటిల్మెంట్ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా, ఇందుకు యువతి ఒప్పుకోకుండా, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో మనస్తాపంతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news