అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు ఇవే

-

తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్​తో పాటు విపక్షాలైన కాంగ్రెస్‌, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించనుందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఆర్టీసీ విలీన బిల్లు, గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా.. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లులపై చర్చించి, వీటి ప్రాముఖ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును మాత్రం తిరిగి ప్రవేశపెట్టనున్నారు. అయితే విశ్వవిద్యాయాల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడం లేదని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news