ఆ 20 యూనివర్సిటీలు ఫేక్‌.. UGC కీలక ప్రకటన

-

దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) ప్రకటించింది. అలాంటి యూనివర్సిటీలు దిల్లీలో ఎనిమిది, యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది.  ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ; విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది.

దిల్లీలో ఫేక్‌ యూనివర్సిటీలు (8)..

  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్ అండ్‌ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌
  • కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌- దర్యాగంజ్‌
  • యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ
  • వొకేషనల్‌ యూనివర్సిటీ;
  • ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
  • విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌;
  • ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌లో (4)..

  • గాంధీ హిందీ విద్యాపీఠ్‌
  • నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ)
  • భారతీయ శిక్షా పరిషత్‌

పశ్చిమబెంగాల్‌లో(2).. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చితో పాటు. కర్ణాటకలో.. బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ.. కేరళలో… సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ , మహారాష్ట్రలో… రాజా అరబిక్‌ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో…. శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వర్సిటీలు ఫేక్ అని యూజీసీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news