కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్బంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటీఎంగా వాడుతున్నారు… ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు అంటూ… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ… తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదని పేర్కొన్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారని గుర్తు చేశారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇయ్యలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుందా…? 60 ఏళ్లు అధికారంలో ఉన్నా తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతగాని వాళ్ళమంటూ ఓటు అడుగుతారా..? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతారా…? అని ప్రశ్నించారు.