యువతకు బ్యాడ్ న్యూస్.. ట్యాంక్​బండ్​పై బర్త్ డే సెలబ్రేషన్స్ బ్యాన్

-

హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా యువతకు బ్యాడ్ న్యూస్. ఇక నుంచి ట్యాంక్ బండ్​పై జన్మదిన వేడుకలు జరపకూడదంటూ జీహెచ్​ఎంసీ అధికారులు అల్టిమేటమ్ జారీ చేశారు. ట్యాంక్​ బండ్​పై బర్త్ డే సెలబ్రేషన్స్​ను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ట్యాంక్ బండ్​పై కేక్ కట్ చేయడం, చెత్త చెందారం పారవేయడం చేస్తే జరిమానాలు విధించనున్నట్లు.. ట్యాంక్ బండ్​పై జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు కట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీటీవీ ద్వారా నిత్యం నిఘా పెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

‘రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ట్యాంక్ బండ్ పై.. నగరవాసులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. కేక్ కట్ చేసి నానా హంగామా సృష్టించడమే కాకుండా చెత్త చెదారం అక్కడే వదిలి వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ చేయడంతో పాటు.. అటుగా వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని’ జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version