కొత్త ఏడాది ప్రారంభం.. నిమిషానికి 1,244 బిర్యానీలు

-

Biryani sales peak in Hyderabad : కొత్త ఏడాది ప్రారంభంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వెల్లువెత్తుతాయి. 2015-20 మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో…. డిసెంబర్ 31న అన్ని ఆర్డర్లు వచ్చాయని జొమాటో కంపెనీ తెలిపింది.

Biryani sales peak in Hyderabad during New Year

నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్ లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గి తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. ఇది ఇలా ఉండగా, డిసెంబర్‌లోని చివరి నాలుగురోజుల్లో రూ.777 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే గతేడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో మాత్రమే అధికంగా అమ్ముడుపోయింది. ఆ రెండు జిల్లాల పరిధిలో 2022లో చివరి నాలుగు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా  2023 డిసెంబరులో అదే నాలుగు రోజుల్లో 242 కోట్లు విక్రయాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version