తెలంగాణ రాష్ట్రం పైన బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కంటే ఇప్పుడు తెలంగాణలో బిజెపి స్ట్రైక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జాతీయ నేతలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జెపి నడ్డా. అధ్యక్ష హోదాలో జేపీ నడ్డా రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.
అనంతరం హరిత ప్లాజా లో పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అటు ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఆ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని పైన బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేస్తారు. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను… ప్రారంభిస్తారు జేపీ నడ్డా.