భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వ, అధికార బీజేపీ పార్టీ దుర్మార్గమైన పద్దతితో మతోన్మాదాన్ని పెట్రేగేలా చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అనేక రకాలుగా దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని… దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, జీడీపీని నాశనం చేశారని, ఆర్థిక వ్యవస్థ చెల్లాచెదురైందని, పరిశ్రమలు మూత పడుతున్నాయని, హంగర్ ఇండెక్స్ లో క్షీణించిపోయామని, సామాన్యుల నడ్డి విరుస్తున్నారని బీజేపీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అధికార అహంకారం తలకెక్కిందని విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్, పుల్వామా అంటూ ప్రజల్ని ఉద్వేగ పరచడంతో ఓట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీపై కేసీఆర్ ఫైర్… రాజకీయం కోసం మతోన్మాదాన్ని పెంచుతోందని ఆగ్రహం
-