మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వరుస సమావేశాలు, సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల వారితో భేటీ అయి తనకు ఓటు వేస్తే వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెబుతూ.. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయితే ఎంత లబ్ధి చేకూరుతుందో చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బిజీగా ఉంటున్నారు.
ఈటల రాజేందర్ ఇవాళ్టి ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్లోని కృష్ణానగర్, మార్కేండయ నగర్, నెహ్రూ నగర్, సంజయ్ గాంధీ నగర్లలో పాదయాత్ర చేస్తూ ఇంటింటి వెళ్లి ఓట్లు అభ్యర్థించనున్నారు. 10 గంటలకు గాజులరామారంలో దేవభూమి నగర్లో కాలనీ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉషోదయ కమ్యూనిటీ హాల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారిని కాషాయ కండువా కప్పి ఆహ్వానిస్తారు. 11 గంటలకు అల్వాల్లో ఎస్సీ మోర్చా మీటింగ్కు హాజరైన తర్వాత 12 గంటలకు ఏఎస్ రావునగర్లో ఫోరమ్ ఫర్ ఇంప్రూవ్ థింగ్స్ తో సమావేశమవుతారు.
1.30 గంటలకు ఆనంద్ బాగ్లో సంచార జాతుల వారితో ఈటల రాజేందర్ మాట్లాడతారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు కుత్బుల్లాపూర్లోని హెచ్ఎంటీ గార్డెన్తో ఉత్తర భారతీయులతో భేటీ అవుతారు ఈటల. 6 గంటలకు మౌలాలి డివిజన్లో రోడ్ షో, 8.30 గంటలకు కైర్ గ్రాండ్ హోటల్లో ఆర్యవైశ్య సంఘంతో సమావేశం ఉంటుంది.