3 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల పై అభిప్రాయ సేకరణకు ముగ్గురితో కమిటీ వేసిన బీజేపీ… మాజీ ఎమ్మెల్యేలు చింతల రామ చంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ప్రేమ్ రాజ్ యాదవ్ లతో కమిటీ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం కానుంది కమిటీ. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి… ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇవ్వనుది కమిటీ.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడా కమిటీ వేసిన బీజేపీ… కమిటీలో ధర్మపురి అరవింద్, పాల్వాయి హరీష్ రావు, avn రెడ్డి, రామ చందర్ రావు, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు పేర్లను చేర్చనుంది. వచ్చే ఏడాది మార్చి 29 తో 3 ఎమ్మెల్సీ స్థానాల గడువు ముగియనుంది. మెదక్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాదు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు…వరంగల్, నల్గొండ , ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్నాయి.
ఈ మూడు స్థానాలకు సీటు కోసం పోటీ పడుతున్నారు బీజేపీ నేతలు…. లాభియింగ్ చేసుకుంటున్నారు నేతలు. కరీంనగర్, అదిలాబాద్ నిజామాబాదు మెదక్ స్థానం నుండి ప్రముఖ విద్యా సంస్థల యజమానిని రంగంలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉందట. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని బీజేపీ నేతలకు చెప్పారు సునీల్ బన్సల్.