యోగికి, కేసీఆర్ కి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని రాజ్యసభ ఎంపీ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. యూపీ లో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే.. అందులో నలుగురు ఓబీసీలకు, ఇద్దరు మహిళ లకు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ కి మోడల్ యూపీ.. ఓబీసీ వర్గాలను పార్టీకి దగ్గర చేస్తా.. తెలంగాణ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి ఎజెండా, గరీబ్ కళ్యాణ్ ఎజెండాతో ముందుకు వెళతాం.. గంగలో మునిగితే మీ పాపాలు పోతాయి.. కేటీఆర్ ఒకసారి నా వెంట రండని పేర్కొన్నారు. యూపీలో రైతులకు 36 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు.. యూపీలో 5 లక్షల ఉద్యోగులను భర్తీ చేశారు.. బీజేపీ ఉద్యమాలను తట్టుకోలేక 80 వేల నోటిఫికేషన్లు వేశారు.. అవి భర్తీ అయ్యేది ఎప్పుడు ? అని నిలదీశారు. పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చింది.. ముషీరాబాద్ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు పనిచేశానని తెలిపారు. పదవులు రావడం నా గొప్ప కాదు.. కార్యకర్తలకు పార్టీ ఇచ్చిన గౌరవమని తెలిపారు. నాలుగు సార్లు ఓడిపోయినా కృంగిపోలేదు.. నా రాజకీయ ఎదుగుదలకు సహకారం అందించిన ముషీరాబాద్ కార్యకర్తలను మరిచిపోలేనన్నారు. బీజేపీ అధిష్టానానికి తెలంగాణ పట్ల క్లారిటీ ఉంది.. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఫైర్ అయ్యారు.