ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ అడ్డదారులు తొక్కదు : లక్ష్మణ్

-

బై వన్, గేట్ వన్ రాజకీయాలు బీజేపీ పాలనలో ఉండవు. దేశ సంపద ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్ ది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. దేశ సంపదకు ప్రతి పౌరుడు అర్హుడు అనే విధానాలు బీజేపీది. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేయదు. దేశ భక్తి, అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. దేశం బీజేపీ పాలన వైపుకు చూస్తోంది. బీజేపీపై ప్రగాఢమైన విశ్వాసంతో దేశ ప్రజలు ఉన్నారు.

ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం అడ్డదారులు తొక్కే పార్టీ బీజేపీ కాదు. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ. జనవరి చివరి లోపల రాష్ర్ట జాతీయ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాంగ్రెస్ ఎంత విషపూరితమైన ప్రచారం చేసిన దేశ ప్రజలు మోడీని మూడో సారి గెలుపించుకున్నారు. ప్రజా సంక్షేమ ప్రతిఫలాలు నేడు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందుతున్నాయి. నాటి కాంగ్రెస్ పాలనకు నేటి బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news