పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం విజయసాయి రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం లో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ప్రజల విజ్ఞాపనలు స్వీకరించారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నేత ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా తనను కలిసిన పాత్రికేయులతో మాట్లాడిన రామకృష్ణా రెడ్డి.. పోలవరం ప్రాజెక్టు విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం. మరి విజయసాయిరెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గదు అని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అయినప్పటికీ సాయిరెడ్డి సమస్య ఏంటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ లకే పరిమితం. జగన్, షర్మిల మధ్య ఫ్యామిలీ వార్ నడుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్టవిరుద్ధంగా ఆస్థులు కూడబెట్టారు. ఇప్పుడు జగన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అని రామకృష్ణా రెడ్డి అన్నారు.