సీఈవో వికాస్​రాజ్​ను కలిసిన బీజేపీ నేతలు.. వారిపై ఫిర్యాదు

-

టీఆర్ఎస్ సర్కార్ బీజేపీ నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీని, పార్టీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డిని బద్నాం చేసే ఉద్దేశంతో టీఆర్ఎస్ నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. సీఈవోను కలిసిన కాషాయ బృందం టీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్​రెడ్డిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్​ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని వారు స్పష్టం చేశారు.

ఉపఎన్నికలో టీఎన్​జీవో నేతలు బహిరంగంగా టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎన్​జీవో అధ్యక్షుడు రాజేందర్‌ సహా నేతలపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

“టీఎన్​జీవో నేతలు బహిరంగంగా ఎన్నికల్లో ఫలనా పార్టీకి మీరు మద్దతుగా పనిచేయండి అని చెప్పుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం.. అవసమైతే వారిపై క్రిమినల్‌ కేసులు కూడా పెడతాం.. మన దేశంలో బ్యాంకింగ్​ రంగం చాలా సెక్యూరిటీతో కూడుకుంది. ఖాతాదారు అనుమతి లేకుండా ఏ బ్యాంక్​ కూడా వారి వ్యక్తిగత సమాచారం ఇవ్వదు. అలాంటింది బయట వ్యక్తులకు ఎలా సమాచారం వెళ్లింది.. ఏ బ్యాంక్​ నుంచి సమాచారం వెళ్లింది.. అనేదానిపై ఆరాతీస్తున్నాం.. వారిపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశాం.”- ప్రకాశ్‌ రెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత

Read more RELATED
Recommended to you

Exit mobile version