రేవంత్ రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేదు : ఎంపీ లక్ష్మణ్

-

బీజేపీ పట్టణ, అగ్రవర్ణాల పార్టీ అన్న వాళ్లకు చెంపపెట్టులా సభ్యత్వ నమోదు చేయాలి అని కేడర్ కు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్ సూచించారు. దక్షిణాదిలో బీజేపీ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ గెల్చుకుంది అని గుర్తు చేసారు. అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల నుంచి సభ్యత్వం తీసుకోవాలి జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారు అని పేర్కొన్నారు.

ఇక రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు తీర్పుకు, బీజేపీకి ముడి పెట్టారు. రేవంత్ రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేకుండా.. అవమానపరుస్తున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు వీడియోలు సృష్టించారు అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version