ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డ్రామా అని మేము అప్పుడే చెప్పాం: లక్ష్మణ్‌

-

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కీలక విషయం బయటపడుతోంది. పోలీసుల విచారణలో నిందితులు రోజుకో కీలక విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గత సర్కార్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు.

ఫోన్ ట్యాపింగ్తో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్‌ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారిని ఉపేక్షించవద్దని పేర్కొన్నారు. మద్యం కేసు నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు బీజేపీ అగ్రనేతల ఫోన్లను కేసీఆర్‌ ట్యాప్‌ చేయించారని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారి పట్ల రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. అధిష్ఠానం ఒత్తిడితో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చాలని చూస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని లక్ష్మణ్‌ హెచ్చరించారు. ఇదంతా చేసి కేసీఆర్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డ్రామాకు తెరదీశారని మండిపడ్డారు. అదంతా డ్రామా అని తాము అప్పుడే చెప్పామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news