మరోసారి కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

-

సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్  చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన మరో వివాదానికి తెరలేపారు. భారత్ పై చైనా దాడి చేయలేదని కేవలం ఆరోపణలు ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చైనా దండయాత్రను అయ్యర్ చరిత్ర నుంచి తుడిచేయాలనుకుంటున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. దీంతో 1962లో జరిగిన దాడి వాస్తవమేనని, మణిశంకర్ పొరపాటున ఆరోపణ అనే పదాన్ని వాడారని కాంగ్రెస్ క్షమాపణలు తెలిపింది. ‘నెహ్రూస్ ఫస్ట్ రిక్రూట్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసారు మణిశంకర్ అయ్యర్. నాడు భారత్ పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలు ఉన్నాయని  అన్నారు.  వాస్తవంగా జరిగిన దాడిని అయ్యర్ ‘ఆరోపణ’ అని పేర్కొనడం దుమారం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news