సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మురళీధర్ రావు. శుక్రవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ని కొట్టాలంటే ఆయన ఇచ్చిన హామీల అమలులో లోపాలతోనే కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పార్టీ డ్యామేజ్ అయిందనడం సరికాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసు అని మురళీ ధర్ పేర్కొన్నారు. నేతలను కలుపుకొనిపోవడం కోసం బండిని తప్పించి ఉండొచ్చని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవీ నుంచి సంజయ్ ని తొలగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాలో కూడా బండి సంజయ్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తుంది. అందుకే రాష్ట్రాల బాధ్యతలను ఆయన ఇచ్చే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.