రాణించిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

-

భారత బౌలర్ల విజృంభణతో ఐర్లాండ్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్ప కూలింది.దాదాపు 11 నెలల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా తొలి ఓవర్ లోనే చెలరేగాడు. దీంతో ఐర్లాండ్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ బుమ్రాకి బౌలర్ ప్రసిద్ధ్, స్పిన్నర్ బిష్ణోయ్ తోడై మరో మూడు వికెట్లు తీశారు. ఐర్లాండ్ బ్లాటర్లు ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, డాక్రల్ వరుసగా 4, 11, 0, 9, 1 పరుగులతో వెనుదిరిగారు.

కేవలం 35 పరుగులకే ఐర్లాండ్ జట్టు 5 వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లకు ఐర్లాండ్ జట్టు కేవలం 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐర్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేయడంతో టీమిండియా టార్గెట్ 140.    ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2023 స్టార్, సిక్సర్ల వీరుడు రింకుసింగ్ ఈ మ్యాచ్ తో అంతర్జాతయీ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. రింకూతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version