బిజెపి వాళ్లు రాముడికి దొంగ భక్తులు – అంజన్ కుమార్ యాదవ్

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. 12 మంది ఎమ్మెల్యేలు పోయారు అంటున్న రాజగోపాల్ రెడ్డి మరి నువ్వేం చేసినట్టు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఫోజులు కొట్టడం కాదు నువ్వు ఎంపీ ఎలా అయ్యావని అన్నారు. కాంగ్రెస్ శవం అంటున్న రాజగోపాల్ రెడ్డి.. మరి శవం దగ్గర ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజగోపాల్ కానీ.. ఇంకో ఏ గోపాల్ కానీ కాంగ్రెస్ పార్టీని అంటే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించారు.

ఈటల రాజేందర్ సానుభూతితో గెలిచి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిలోకి పోయి మాకు నీతులు చెప్తున్నావా అని అన్నారు. బిజెపి వాళ్లు రాముడికి దొంగ భక్తులని.. అసలు భక్తులము మేమేనని అన్నారు. నా పేరే అంజన్ అని తెలిపారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను బిజెపి విధ్వంసం చేస్తుందన్నారు. మోడీ దేవుడు అంటున్న బండి సంజయ్ తెలంగాణకి మీ దేవుడు ఏం చేశాడంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. దాన్ని ఎవరూ ఖతం చేయలేరని అన్నారు అంజన్ కుమార్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version