Ram Charan: రామ్ చరణ్ ‘మగధీర’లోని ‘బంగారు కోడి పెట్ట’ సాంగ్ పై ఎస్పీ బాలు కామెంట్స్ ఇవే..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మగధీర’ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ చూసి ప్రేక్షకలోకం ఫిదా అయిపోయింది. ఇక ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ , స్టైల్, నటన చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటికే రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి..ఈ పాటలో ఓ మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు.

magadheera

‘బంగారు కోడి పెట్ట’ సాంగ్ ను ‘మగధీర’లో రీమేక్ చేశారు. ఈ సాంగ్ రికార్డింగ్ టైమ్ లో ‘అప్..అప్.. హ్యాండ్స్ అప్..’ అని సింగర్స్ ను చెప్పామన్నారట. అయితే, ఎవరు ఎన్ని సార్లు చెప్తున్నప్పటికీ బీట్ కు తగ్గట్లు రావడం లేదు. దాంతో కీరవాణి లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు వాయిస్ నే ఇందులో పెట్టేశారు.

ఇక ఈ పాటను తర్వాత విన్న ఎస్పీబాలు ఈ వాయిస్ తన గొంతు లాగా ఉన్నదని ఎవరా సింగర్ ? అని ఎం.ఎం.కీరవాణిని అడిగారట. అప్పుడు కీరవాణి..మీ గొంతులాగా కాదు సర్..మీదే అని చెప్పేశారట. అలా ఎస్పీ బాలుకు చెప్పకుండానే కీరవాణి ఆయన వాయిస్ ను రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రంలో యూస్ చేశారు. వందమందిని చంపే యోధుడిగా ‘కాలభైరవ’గా ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

mm keeravani

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించగా, రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్ర పోషించారు.

ఇక ఇటీవల విడుదలైన రాజమౌళి RRR పిక్చర్ లో రామ్ చరణ్ ‘రామరాజు’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు. రామ్ చరణ్.. ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version