మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్ చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఆమె తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని తెలిపారు. మూడో వ్యక్తి కుటుంబం గురుంచి మాట్లాడడం తప్పు. సినిమా వాళ్ళు ఐన ఇతరులను ఎవరైనా రాజకీయ విమర్శల్లోకి లాగడం సరికాదు అన్నారు. అదే విధంగా మనం మాట్లాడే మాటలు మన విజ్ఞతను తెలియజేస్తాయి అని పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన వనతీ శ్రీనివాసన్.. తొలిసారి తెలంగాణ పూల పండుగలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. అయితే బతుకమ్మ పండుగ నిర్వహణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద ఘనంగా బతుకమ్మ నిర్వహించాము. సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ హిందూ సాంప్రదాయాలు ఆగౌరపరుస్తుంది. అసలు హిందువుల పండగలు అంటేనే కాంగ్రెస్ కు చిన్న చూపు అని వనతీ శ్రీనివాసన్ తెలిపారు.