కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు.. సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అలాగే 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి – పాలనాపరమైన అనుమతులిచ్చిన ప్రభుత్వం.. 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ రోడ్డు నెం.45 నుంచి కేబీఆర్ పార్కు యూసఫ్‌గూడ వైపు వై ఆకారంలో అండర్‌పాస్ ఏర్పాటు చేయనుంది. అలాగే కేబీఆర్ పార్కు ప్రవేశం నుంచి రోడ్డు నెం.36 వరకు నాలుగు లైన్ల ప్లైఓవర్.. యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్ వరకు రెండు లైన్ల ప్లైఓవర్.. కేబీఆర్ ఎంట్రెన్స్ ముగ్ధ జంక్షన్ .. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ల అండర్‌పాస్ ఏర్పాటు చేయనున్నారు.
ఇక పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్.. కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్.. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్ నెంబర్-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్.. ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నెం.45 జంక్షన్ వరకు 2 లైన్ల అండర్‌పాస్.. ఫిలింనగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్.. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వరకు అండర్ పాస్.. ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-12 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్.. కేబీఆర్ పార్కు నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్.. అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్డు నెంబర్-10 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ వేయడానికి సిద్ధం అయ్యింది ప్రభుత్వం.