హైదరాబాద్ ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌

-

హైదరాబాద్​ శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్​ పోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి బాంబు కోసం వెతికారు. దాదాపు రెండు మూడు గంటల పాటు ఎయిర్​పోర్టును జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని గ్రహించారు.

terrorist@gmail.com నుంచి మెయిల్‌ విమానాశ్రయం ఆపరేషన్స్‌ కంట్రోల్‌ కేంద్రానికి మెయిల్ వచ్చినట్టు తెలిసింది. అయితే కొద్ది సేపటికే తన కుమారుడు ఫోన్​తో ఆడుకుంటూ మెయిల్ పెట్టాడని.. తప్పు జరిగిందని ఇంకో మెయిల్ వచ్చింది. ఈ వ్యవహారంపై విమానాశ్రయం అధికారులు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు.

‘మా మెయిల్​కు terrorist@gmail.com నుంచి ఎయిర్​పోర్టులో బాంబు ఉందని ఫిర్యాదు అందింది. వెంటనే మేం అధికారులకు సమాచారం అందించాం. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ అందరూ రంగంలోకి దిగి బాంబు కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని అర్థమైంది. అయినా మేం ఫిర్యాదు చేశాం. బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version