ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట కొనసాగనుంది. ఉద్యమకారులను అవమాన పరుస్తున్నారంటూ వేదిక ముందు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధుపై ఆగ్రహం వ్యక్తం చేసారు బొమ్మెర రామ్మూర్తి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో దొంగలున్నారు. దొంగలను పారదోలినప్పుడే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ బొమ్మెర రామ్మూర్తి షాకింగ్ కామెంట్స్ చేసారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావును కెసిఆర్ ఫైనల్ చేశారు. ఇక అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గత కొన్ని రోజులుగా గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల తెల్లం వెంకటరావు కలిశారు.