ఎన్డీఏలోకి టీడీపీ.. సీట్ల సర్దుబాటుపై నేడు మరోసారి చర్చ!

-

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏ కూటమి పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై అమిత్‌షా, నడ్డాలు గురువారం రాత్రి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లతో చర్చించినట్లు సమాచారం.

మరోవైపు.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే ఇవాళ  మరోసారి సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఎన్‌డీయేలో టీడీపీ చేరిక ఖరారైనట్లే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version