మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కార్ మరో కుట్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు నెలల దాకా రిపేర్లు చేయోద్దంటు తమ ఆస్థాన మీడియాకు లీకులు ఇచ్చింది సీఎంఓ. కాళేశ్వరం ప్రాజెక్టు పై సర్కారు కోరుకున్నట్టే కేంద్రం చేస్తున్నదని సమాచారం అందుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్ఠత పై వేసిన కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం డెడ్ లైన్ పెట్టింది.
ఈ డెడ్ లైన్‌ను అడ్డం పెట్టుకొని మేడిగడ్డను ఆగం చేసే స్కెచ్ వేసింది. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు.. అంటే నాలుగు నెలల పాటు బ్యారేజీ వద్ద ఏ పనులు చేపట్టాల్సిన అవసరం లేదంటూ సీఎంఓ నుంచి లీకులు ఇచ్చి పత్రికల్లో వార్తలు రాయించారు. వానాకాలం వచ్చే వరకు దెబ్బతిన్న పిల్లర్లను కాపాడే కనీస ప్రయత్నాలు చేయకుండా కేంద్రం వేసిన కమిటీ అడ్డం పెట్టుకున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. ఇక వానాకాలంలో గోదావరి ఉప్పొంగితే ఆ ఉధృతికి దెబ్బతిన్న పియర్లు కొట్టుకుపోయి మేడిగడ్డ మొండి గోడలుగా మారాలని చూస్తోందని అంటున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు.