Breaking: కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం

-

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం రేపాయి. నియో పోలీస్ వద్ద డిటోనేటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేసింది ఓ నిర్మాణ సంస్థ. బ్లాస్టింగ్ తో ఒక్కసారిగా గాలిలోకి లేచాయి బండ రాళ్లు. దీంతో గాలిలో రాళ్లను చూసి స్థానికులు పరుగులు తీశారు. ఒకటి కాదు రెండు కాదు 10 చోట్ల బ్లాస్టింగ్స్ జరిపారు.

దీంతో సినిమా షూటింగ్ మాదిరిగా బండ రాళ్లు గాల్లోకి లేచాయి. బండరాళ్లు అయ్యప్ప స్వాముల శిబిరంతో పాటు లేబర్ క్యాంప్ లో పడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. లేబర్ క్యాంపులో ఉన్న కార్మికులు, అయ్యప్ప స్వాములు ప్రాణాలతో బయటపడ్డారు.

వంట సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది. ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గాలిలో బండ రాళ్లను చూసి సినిమా షూటింగ్ అనుకున్నారు స్థానికులు.‌ ఈ ఘటనతో బ్లాస్టింగ్ చేసిన నిర్మాణ సంస్థపై నార్సింగీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వారిపై ఎక్స్ప్లో జివ్ యాక్ట్ తో పాటు BNS 125, 91B ప్రకారం కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news