కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. చాలామంది ప్రాణాలని కోల్పోయారు. ప్రపంచం మొత్తం కరోనా కారణంగా వణికిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా వైరస్ ని మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. అలాగే చాలా రకాల వైరస్లు కూడా అందర్నీ వణికిస్తున్నాయి ఇప్పుడు ప్రజలు డింగా డింగా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికన్ దేశం ఉగాండాలో వచ్చిన వార్త అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఈ వైరస్ అక్కడ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నగరంలో దాదాపు 300 మందికి ఈ వింత వ్యాధి సోకింది. ఈ విచిత్రమైన వ్యాధి పేరు డింగా డింగా అని పెట్టారు. ఈ పేరు వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా? కానీ ఈ వైరస్ మాత్రం అలా కాదు చాలా ప్రమాదకరమైనది మహిళలు, యుక్త వయసులో ఉన్న వారిని ఎక్కువగా ఈ వ్యాధి ఎఫెక్ట్ చేస్తోంది. ఈ వైరస్ సోకిన వాళ్లకు జ్వరం వస్తుంది తర్వాత శరీరం అంతా కూడా వణికి పోతుంది. రోజు రోజుకి స్ప్రెడ్ అవుతోంది.
ఈ వైరస్ కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చూద్దాం.. ఆరోగ్య బృందాలు చికిత్స చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరూ మరణించలేదు. ఈ వైరస్ కి మందులు లేదా వ్యాక్సిన్ కూడా లేదు. కొన్ని పద్ధతుల్ని పాటిస్తే వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు బండిబుక్యో జిల్లాలో తప్ప ఒక డింగడింగా కేసు కూడా నమోదు కాలేదు. ఈ వైరస్ గురించి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఉగాండాలో వైరస్ రకం ఎప్పటికీ కూడా తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే 400 మందికి వ్యాధి సోకిందని 30 మంది మరణించారని ఉగాండా లో వచ్చిన వైరస్ గురించి చెప్పింది.