BREAKING: ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు

-

BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది ఈడి.

ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్ కి చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై బుధవారం అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన నుంచి ఈడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడి అభియోగం మోపింది.

ఈ నేపథ్యంలోనే గురువారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడి. నిజానికి అరుణ్ అప్రూవర్ గా మారడం ఇది కొత్త కాదు. గతంలో ఓసారి కూడా ఇలాగే అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఇప్పుడు మరోసారి అప్రూవర్ గా మారారు అరుణ్ రామచంద్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version