బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండుకుండల్లా మారిపోయి ఎటు చూసిన వరదలు ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలి.
అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్‌లు తెప్పించాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు సెలవులు రద్దుచేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో, చెరువులు, కాలువలు వద్దకు ఎవరు వెళ్ళవద్దని సూచించారు. పోలీసులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలన్నారు.