ఆదివారం తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామని తెలిపారు.
1988 కేంద్ర వాహన చట్టానికి. సుప్రీం కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి రాబోతున్నామని తెలిపారు పొన్నం ప్రభాకర్. ఉద్యోగులలో అసహనం తొలగించడానికి పెండింగ్ సమస్యలు, ప్రమోషన్స్ చేపడతామని తెలిపారు.
చట్టాన్ని కఠినం చేస్తూనే.. రవాణా శాఖ ఆదాయాన్ని మరింత పెంచుతామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 6,916 లైసెన్సులు రద్దు చేశామని తెలిపారు పొన్నం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకువస్తున్నామని తెలిపారు. రోడ్ సేఫ్టీ సరి చేస్తూ.. నిబంధనలను కఠినం చేయడానికి ట్రాన్స్ పోర్ట్ విజిలెన్స్ స్ట్రిక్ట్ గా పనిచేస్తుందన్నారు.