రేవంత్ రెడ్డికి BRS కౌంటర్…నువ్వు ఓ బుడ్డరాఖాన్‌

-

నువ్వు ఓ బుడ్డరాఖాన్‌ అంటూ రేవంత్ రెడ్డికి BRS కౌంటర్ ఇచ్చింది. బిఆర్ఎస్, బిజెపి నేతల ఇళ్లపై ఐటి రైడ్స్ ఎందుకు జరగడం లేదన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘రేటెంత రెడ్డి నువ్వేమో స్వీట్లు అమ్ముకోవడంలో బిజీ ఆయే. కొత్త ప్రభాకర్ రెడ్డి, వద్దిరాజు, నామ, గంగుల, మల్లారెడ్డి, మర్రి, పైళ్ల, మాగంటి ఇళ్లపై దాడులు జరిగాయి. అన్ని ప్రతిపక్ష పార్టీల లాగే బిఆర్ఎస్ కూడా బీజేపీ వేధింపులకు గురవుతోంది. నీలాంటి బుడ్డర్ ఖాన్ మాటల్ని ప్రజలు నమ్మరు’ అని బిఆర్ఎస్ ట్వీట్ చేసింది.

ఇది ఇలా ఉండగా… ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆగ్రహించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news