బీఆర్ఎస్ కి తెలంగాణలో భవిష్యత్ లేదు : కిషన్ రెడ్డి

-

బీజేపీలోకి ఎవ్వరు వచ్చినా చేర్చుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. తెలంగాణలో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్ ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

ఇక బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అది వృధా అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కి తెలంగాణలో భవిష్యత్ లేదని తెలిపారు. 17 సీట్లకు 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కార్యచరణ కోసం జాతీయ నాయకులను కలిశాం. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలోకి ఎవ్వరు వచ్చినా చేర్చుకుంటామని తెలిపారు. సీట్ల విషయం అంతా అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news