3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దించుతున్నాడు కదా ? – గాదరి కిషోర్

-

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి 6 ఫీట్లు ఉన్నా, అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దించుతున్నాడు కదా సరిపోలేదా? అని చురకలు అంటించారు.

BRS leader Gadari Kishore slams Revanth Reddy
BRS leader Gadari Kishore slams Revanth Reddy

జగదీష్ రెడ్డికి భయపడే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించినావు కదా రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఎమన్నా అంటే కేసీఆర్‌ని ఊరి తీయాలి అంటాడు ఆయనను కాదు నిన్ను ఊరి తీయాలని రేవంత్ రెడ్డిపై ఆగ్రహిచారు. ఎన్నికలు వస్తున్నాయంటే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడని చురకలు అంటించారు. గోదావరి జలాలు తెచ్చుడు అంత ఈజీ అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మరి మేము తీసుకు వచ్చాం కదా అని ప్రశ్నించాడు. అవును గోదావరి జలాలు తెచ్చుడు ఓటుకు నోటు కేసులో సూట్కేస్ మోసినంత కష్టం అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.

Read more RELATED
Recommended to you

Latest news