బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కొత్త అబద్దాల మూటనే : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని బీఆర్ఎస్, కాంగ్రెస్,  బీజేపీలు వ్యూహాలు అమ‌లు చేస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ త్వ‌ర‌లోనే త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు.  ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, రూ.లక్ష పంట రుణ మాఫీ, రూ.3,106 నిరుద్యోగ భృతి, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర హామీలను 2014, 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంద‌ని అన్నారు.

ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మ‌ళ్లీ తీసుకువ‌స్తున్న వారి కొత్త‌ మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అబద్ధాలతో ముందుకు రాబోతున్న‌ద‌ని ఆరోపించారు. ప్రతిపక్షాల మనసులను ఖాళీ చేసేలా సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news