మల్కాజిగిరి అభ్యర్థిగా రాజశేఖర్‌రెడ్డి.. జనగామలో పల్లా.. మిగతా 2 స్థానాల్లో ఎవరంటే..?

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాకు రంగం సిద్ధమైంది. తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే తాజాగా మల్కాజిగిరి, జనగాం, నర్సాపూర్, గోషామహల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.

brs party

మల్కాజిగిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది.

మరోవైపు జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గోషామహల్‌ స్థానానికి నంద కిశోర్‌, ఆశీష్‌ కుమార్‌ యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయి. ఈ అభ్యర్థుల పేర్లను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news