తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. శాసన సభ ను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారు అని BRS MLA జగదీష్ రెడ్డి అన్నారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదు. లగచర్ల రైతుల సమస్యపై చర్చించడానికి సమయం అడిగాము. కానీ స్పందించడం లేదు.. రైతుల సమస్య కంటే టూరిజం ఎక్కువైంది. కేవలం ఢిల్లీ, జైపూర్, కొరియా వెళ్లే దానిపై శ్రద్ధ ఉంది. కేటీఆర్ పై ఎలా కేసు పెట్టాలనే దానిపై ఆలోచిస్తున్నారు అని అన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టు. మహిళలకి ప్రకటించిన హామీల పై చర్చ పెట్టు. 6 గ్యరెంటీల పై చర్చ పెట్టు అని సవాల్ విసిరారు. శాసన సభ ను చూసి కాంగ్రెస్ బయపడుతుంది. మీ బిల్లు ఆమోదం చేసుకోవడానికి మూడు నాలుగు రోజు అసెంబ్లీ నడిపిద్ధాం అనుకుంటున్నారు. మా ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఫైల్ పై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. చర్చ కు కేటీఆర్ వస్తాడు. కానీ చర్చ పెట్టమంటే సభ వాయిదా వేసి పారిపోతున్నారు. అసెంబ్లీ లో మా గొంతు నొక్కినా ప్రజా క్షేత్రంలో మీ పై పోరాటం చేస్తాం అని అన్నారు జగదీష్ రెడ్డి.