తెలంగాణ అసెంబ్లీని స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో మీడియా పాయింట్ వద్దకు వచ్చిన BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అసెంబ్లీ లో కాంగ్రెస్ తీరు విచిత్రంగా ఉంది.. అసెంబ్లీ జరిగే ముందు BAC సమావేశం జరగాలి. BAC లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ నిర్వహించాలి. కానీ బీఏసీ సమావేశంలో కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి వెళ్ళాలని అనడాన్ని MIM, BRS వ్యతిరేకించింది అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే అసెంబ్లీ నిర్వహణలో కనీస పద్ధతులు కూడా పాటించడం లేదు అని చెప్పిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. లగచర్ల అంశం పై చర్చించాలని అర్జంట్ మోషన్ ఇచ్చాము. కానీ దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు ఆయన. అలాగే గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నాము. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.