మీరిచ్చిన ఇచ్చిన గ్యారంటీలకు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోదు : కడియం

-

అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణాంకాలు చదివి వినిపించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. బడ్జెట్‌లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబుతునే ఆర్థిక వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఒక పేజీలో పుట గడవలేని, జీతాలివ్వాలేని పరిస్థితి అని రాశారని.. మరో పేజీలో కేసీఆర్‌ పాలనలో తలసరి ఆదాయం పెరిగిందని, జీఎస్‌డీపీ పెరిగిందని చెప్పారని వెల్లడించారు.

“కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ అభయహస్తం పేరిట అనేక హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువత, మైనార్టీ, మహిళ, రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సరిపోదు. వచ్చే ఆరు మాసాల్లోకూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేరు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్‌ ఉంది”. అని కడియం శ్రీహరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news