సంవత్సరం గడవకముందే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇంట్లో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. లాస్య నందిత తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న గత సంవత్సరం ఫిబ్రవరి 19 మృతి చెందాడు. ఇక ఇవాళ అంటే ఫిబ్రవరి 23 వ తేదీన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణించారు. ఎమ్మెల్యే లాస్య నందినికి ప్రమాదాలు వెంటాడుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించింది మృత్యువు.. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కు కాలం కలిసిరాలేదు. లిఫ్టులో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయటపడ్డారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత. నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదం జరిగింది. ఇక మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.