అసెంబ్లీలో మమ్మల్ని అవహేళన చేశారు..!

-

అసెంబ్లీలో నాలుగున్నర గంటలు మేము నిలబడినా మాకు అవకాశం ఇవ్వలేదు.. కొత్తగా ఎనికైన సభ్యులు మమ్మల్ని అవహేళన చేశారు అని BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదు.

అందరి రాజకీయ పరిస్థితులు వేరు… సబితా ఇంద్రారెడ్డి, నా రాజకీయ ప్రస్థానం.. మా రాజకీయ పరిస్థితులు వేరు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వారి విజ్ఞతకు వదిలి వేస్తున్నా. నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే బిఆర్ఎస్ పార్టీలో చేరాను. నేను BRS పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే కాదు. నేను సీఎం రేవంత్ రెడ్డిని 2018లో నర్సాపూర్ తీసుకువెళ్ళినప్పుడు రెండు కేసులు అయ్యాయని చెప్పారు. అదే సమయంలో నాపైన మూడు కేసులు అయ్యాయి. నేను కేసులు తీయించుకున్నానని రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. కానీ నేను 2023 ఎన్నికల అఫిడవిట్ లో నాపైన ఉన్న కేసులను పొందుపరిచాను. సభలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలను, బ్రష్ మహిళా ఎమ్మెల్యేలను ఒకలా సీఎం చూస్తారా అని సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version