తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం గవర్నర్ ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే తీర్మాణం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల
మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనను వెంటనే సస్పెండ్
చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీమంత్రి జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. అసెంబ్లీలో జరిగిన రగడకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.