కాంగ్రెస్ వైఫల్యాలపై పాట పాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సంబురాలు జరుపుకుంటోంది.  కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం వద్ద ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆదానీ దోస్తీకి సంబంధించిన టీ-షర్టులతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని బీఆర్ఎస్ భవన్ వద్ద వదిలేశారు. వ్యాన్ లో తరలిస్తుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఓ పాట పాడారు. గోవిందా హరి గోవిందా.. కాంగ్రెస్ వస్తే.. గోవిందా, రైతు బంధు గోవిందా.. రైతు బీమా గోవిందా, కళ్యాణ లక్ష్మీ గోవిందా, స్కాలర్ షిప్పులు గోవిందా, తులం బంగారం గోవిందా, కేసీఆర్ కిట్ గోవిందా అంటూ పాట పాడుతూ నిరసన తెలిపారు. చప్పుట్లు కొడుతూ ఎమ్మెల్యేలకు కేటీఆర్ గొంతు కలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news