దిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు విచారణ మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించారు. మరికొందరని ఏకంగా అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రోజున విచారణకు రావాలంటూ నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాళ ఆణె విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకో ర్టులో కేసు పెండింగ్‌లో ఉందని ఈ క్రమంలో తాను విచారణకు రాలేనని తెలిపారు. ఇదే కేసులో గతంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా ఆమె విచారణకు హాజరయ్యారు. గత మార్చిలో మూడురోజుల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇటీవల ఇదే కేసులో దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు కూడా ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా ఈడీ విచారణకు హాజరుకాలేదు.