కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రధానంగా రాష్ట్రానికి రావలసిన నిధులతో పాటు కేంద్రం ఇచ్చిన హామీలపై మోడీ సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చేలా పార్టీ ఎంపీలకు కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విభజన చట్టంలోని హామీలపై ఎంపీలు పార్లమెంట్ లో గళం వినిపించాలని కెసిఆర్ సూచించనున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయి రాజకీయాలపై కూడా కేసీఆర్ ఎంపీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?